_ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన శాసనసభ్యులు ,
— ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించిన నాయకులు,
మన ప్రగతి న్యూస్/ చొప్పదండి నియోజకవర్గం:
చొప్పదండి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న 100 పడకల ఆసుపత్రి. మినిష్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ను వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించిన చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం. ఈ ఆసుపత్రి ప్రారంభంతో చొప్పదండి మండలంతో పాటు చుట్టు పక్కల ఉన్న నాలుగు మండలాల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వెంట చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఫోరం అధ్యక్షులు గుర్రం సుజీత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

