బిఆర్ఎస్ నాయకులు పాదయాత్ర
మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్ :
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ ర్రావు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ రాజన్న సిరిసిల్ల కేంద్రంలో మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొండ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు, పాదయాత్ర నిర్వహించారు. హనుమాన్ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి సిద్దిపేట మీదుగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం, కొండపోచమ్మ ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ జనగామ శరత్ రావు, పార్టీ మండల అధ్యక్షులు సురేందర్ రావు, పట్టణ అధ్యక్షులునరసింహారెడ్డి, గోపాల్ రావు, విజయ రామారావు, ఆనంద్ రావు పాల్గొన్నారు.

