బ్రేకింగ్ న్యూస్
పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి.కెసిఆర్ మళ్లీ సీఎం కావాలి19న సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలిపాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవంవిద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలుఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంపాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి.కెసిఆర్ మళ్లీ సీఎం కావాలి19న సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలిపాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవంవిద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలుఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవం
కరీంనగర్

రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.

రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.

—- నేల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచన,
—- వ్యవసాయ సహాయ సంచాలకులు,శాస్త్రవేత్తలు
— మండల వ్యవసాయ అధికారులు,

మన ప్రగతి న్యూస్/ చొప్పదండి నియోజకవర్గం:

చొప్పదండి మండలంలోని కాట్నపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గన్ను శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రియదర్శిని మాట్లాడుతూ, రైతులు వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ, నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి వనరుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ మాట్లాడుతూ నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వినియోగం, సాగునీటి పొదుపు, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు మరియు సాగు ఖర్చుల తగ్గింపు ద్వారా రైతుల ఆదాయం పెంపొందించుకునే మార్గాలపై అవగాహన కల్పించారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య మరియు పశుసంవర్ధక శాస్త్రవేత్త ప్రభాకర్ మాట్లాడుతూ మత్స్య, పశు సంవర్ధక రంగాల్లో అనుసరించాల్సిన మెరుగైన యాజమాన్య పద్ధతులు, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాల ద్వారా రైతుల ఆదాయం పెంపొందించుకునే అవకాశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కాట్నపల్లి గ్రామ సర్పంచ్ గన్ను శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ గన్ను నరేందర్ రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి కవిత, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రభాకర్ మరియు రైతులు పాల్గొన్నారు.

పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!
పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!