మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తన సతీమణి లలితతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ పెద్ద కుమార్తె డాక్టర్ మాలోత్ గాయత్రి వివాహానికి ముఖ్యమంత్రి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. డిసెంబర్ 3న వైరాలో నిర్వహించనున్న వివాహ వేడుకకు ఎమ్మెల్యే దంపతులు ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు.


