అభయ నాగేంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు.
మనప్రగతిన్యూస్/నల్లబెల్లి:
మండలంలోని అభయ నాగేంద్ర స్వామి దేవాలయంలో కార్తిక పౌర్ణమి వేడుక
లను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు కింద భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు.
కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధనలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

