శివాలయంలో కార్తీక పౌర్ణమి శోభ
భక్తులతో పోటెత్తిన హరి హర దేవాలయాలు
కొమ్మ పున్నమి రోజు కోటి పూజలు.
మనప్రగతిన్యూస్/నల్లబెల్లి:
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి గా పేర్కొంటూ ఈరోజు మహా పర్వదినంగా ఉసిరి చెట్టు కింద 365 దూది భక్తులు కాల్చడంతో పాటు శివవిష్ణువులను పూజించే ఆనవాయితీ పురాతన కాలం నుండి కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి, అభయ నాగేంద్ర స్వామి దేవాలయానికి, సీతారామచంద్రస్వామి దేవాలయానికి మంగళవారం ఉదయం నుండి భక్తులు పోటెత్తారు, ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలతో పాటు 365 వత్తులు కాల్చే కార్యక్రమాన్ని చేపట్టారు. కామ, క్రోధ, మోద, లోభ, మదమచర్యాలు, అను 18 గుణాలకు స్వస్తి చెప్పేందుకు ఈ కార్తీక పౌర్ణమి పండుగ వేదికగా ఉంటుందని తత్వవేత్తలు పేర్కొన్నారు. కొమ్మ పున్నమి రోజు దేవతలకు కోటి పూజలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం, మండలంలోని అన్ని గ్రామాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు తమ స్వగృహాల ముందు తులసి చెట్టు సమీపంలో ఉసిరికొమ్మను ఏర్పాటు చేసుకొని మండల ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మండలంలోని గోవిందా పూర్ సమీపంలోని పురాతన శివాలయం, గుండ్ల పహాడ్ గ్రామంలోని కాకతీయులనాటి శివాలయంలో, మేడపల్లి శ్రీ రాజరాజేశ్వర సహిత సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా దేవాలయాల అర్చకులు దేవతామూర్తులకు ప్రత్యేక అలంకరణ చేయడంతో పాటు పూజలు అర్చనలు చేపట్టి దీప దానాలను స్వీకరించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

