కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడు కోల లింగయ్య రాజీనామా
30 ఏళ్ల కాంగ్రెస్ ప్రస్థానానికి స్వస్తి – ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తీరుపై అసంతృప్తి
మనప్రగతిన్యూస్/నల్లబెల్లి:
మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోల లింగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేసిన ఆయన, తాజాగా పార్టీకి రాజీనామా చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ సందర్భంగా కోల లింగయ్య మాట్లాడుతూ, నల్లబెల్లి గ్రామ సమస్యలపై ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తగిన శ్రద్ధ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోవడం, గ్రామ అభివృద్ధికి తగిన ప్రాధాన్యతఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సీనియర్ నాయకుడు రాజీనామా చేయడం నల్లబెల్లి మండల రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాజీనామాతో స్థానిక కాంగ్రెస్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో వేచి చూడాలి.

