మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కోనేరు చిన్ని కలిసి ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో కొద్దిసేపు మాట్లాడి మర్యాదపూర్వకంగా పలకరించారు.

