ఎంటర్టైన్మెంట్ డెస్క్: దీపావళి పండుగ సందర్భంగా ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ సినిమా నుంచి ‘బారాత్ బీట్’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. శ్రీనివాస్ (ప్రియదర్శి), శ్రీలత (నాగదుర్గ) పెళ్లి బారాత్ నేపథ్యంలో ఈ డ్యాన్స్ నంబర్‌ను రూపొందించారు. పాటలో నాగదుర్గ మాస్ డ్యాన్స్ స్టెప్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఎంటర్టైనింగ్ డ్రామాగా యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్నారు. ప్రియదర్శి సరసన ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్గా నటిస్తున్నారు.
సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ‘బారాత్ బీట్’ పాటకు ఆకట్టుకునే బీట్‌ను సమకూర్చారు. ‘ఇడుపు కాయితం’ చిత్రం డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

