బ్రేకింగ్ న్యూస్
ఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంపేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యంఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంపేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యం
హైదరాబాద్

చర్లపల్లి జైలులో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు – ఖైదీలకు తొమ్మిది వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ.. ఒక్కో విడతలో 200 మందికి అవకాశం

చర్లపల్లి జైలులో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు – ఖైదీలకు తొమ్మిది వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ.. ఒక్కో విడతలో 200 మందికి అవకాశం

మన ప్రగతి న్యూస్/ చర్లపల్లి,మేడ్చల్వి జిల్లాస్టాపర్ :ఖైదీల్లో విద్యాభివృద్ధితోపాటు వృత్తి నైపుణ్యాలను పెంపొందించి, వారిని సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ జైళ్ల శాఖ మరో కీలక ముందడుగు వేసింది. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్‌ ఈ సంస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి దాసరి హరిచందన, ఉపాధి, శిక్షణ శాఖ సంచాలకురాలు ఎ.క్రాంతి వెస్లీ హాజరయ్యారు. తెలంగాణ జైళ్ల శాఖ పరిధిలో ప్రభుత్వ ఐటీఐని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిది వృత్తి విద్యా కోర్సులకు కేంద్ర ప్రభుత్వ శిక్షణ సంస్థ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఒక్కో విడతలో 200 మంది ఖైదీలకు శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేశారు. ఫిట్టర్, పెయింటర్, నేత పనుల సాంకేతిక శిక్షణ, చెక్క పనులు, వెల్డింగ్, దుస్తుల తయారీ, గృహ నిర్వహణ, ఉద్యానవనం, పూల మొక్కల పెంపకం, తోటల రూపకల్పన వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం తొమ్మిది మంది నైపుణ్యం కలిగిన శిక్షకులను అందుబాటులో ఉంచారు. ఐటీఐ ప్రారంభోత్సవంలో జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. ఖైదీలకు విద్యతోపాటు వృత్తి నైపుణ్యాలను అందించడం ద్వారా వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావచ్చని తెలిపారు. ఇప్పటికే సుమారు 200 మంది ఖైదీలు ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపినట్లు వెల్లడించారు. జైళ్లను కేవలం నిర్బంధ కేంద్రాలుగా కాకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, పునరావాస కేంద్రాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఖైదీల విద్యాభివృద్ధికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు సౌమ్య మిశ్రా తెలిపారు. జాతీయ సార్వత్రిక విద్యా సంస్థ ద్వారా ఇటీవల 78 మంది ఖైదీలు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. తెలంగాణ సార్వత్రిక విద్యా సొసైటీతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం మరో 70 మంది ఖైదీలు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో చేరినట్లు వివరించారు. విద్యను కొనసాగించాలనే ఆసక్తి ఉన్న ఖైదీలను వృత్తి విద్యా కోర్సుల వైపు కూడా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శి దాసరి హరిచందన మాట్లాడుతూ.. ఖైదీలకు గుర్తింపు పొందిన వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందించడం వల్ల వారు విడుదలైన అనంతరం ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పొందేందుకు వీలవుతుందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలతో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ఖైదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధి, శిక్షణ శాఖ సంచాలకురాలు ఎ.క్రాంతి వెస్లీ మాట్లాడుతూ.. ఐటీఐ శిక్షణను శిక్షలో భాగంగా కాకుండా జీవితాన్ని మార్చుకునేందుకు లభించిన గొప్ప అవకాశంగా భావించాలని ఖైదీలకు సూచించారు. శిక్షణ ద్వారా ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకుని, విడుదల అనంతరం గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు సిద్ధం కావాలని అన్నారు. జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఎం.సంపత్ మాట్లాడుతూ.. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఐటీఐ ఏర్పాటు చేయడం ద్వారా ఖైదీలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందే అవకాశం కలిగిందన్నారు. ఖైదీల సంక్షేమం, పునరావాసానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎన్.మురళీబాబు, వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ డి.శ్రీనివాస్, చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ జి.ప్రమోద్, పరిశ్రమల శాఖ ఉప సంచాలకుడు ఎస్.డి.ఖలీద్ అక్తర్, ఎస్‌ఐసీఏ ప్రిన్సిపాల్ ఎస్.శ్రీనివాసరెడ్డి, ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలు సూపరింటెండెంట్ పి.అశోక్, జైలర్ శ్రీనివాస్, డిప్యూటీ జైలర్ వై.వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.

బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు