బ్రేకింగ్ న్యూస్
తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలిఅంగరంగ వైభవంగా దీపావళి సంబరాలుఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్యటీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకంనిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలిట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళనరహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదంజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వంగాల కళ్యాణి నియామకంపోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్అంగరంగ వైభవంగా గోంతేలమ్మ కోలాట వేడుకలు -దొంతికుంటతుఫాన్‌తో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలిఅంగరంగ వైభవంగా దీపావళి సంబరాలుఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్యటీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకంనిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలిట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళనరహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదంజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వంగాల కళ్యాణి నియామకంపోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్అంగరంగ వైభవంగా గోంతేలమ్మ కోలాట వేడుకలు -దొంతికుంట
తెలంగాణ

అలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..

అలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..

కేక్ కట్ చేసిన మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి..

శామీర్ పేట్ నవంబర్ 9 ( సిటీటైమ్స్ ):- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానులు , కార్యకర్తలు, నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. ఇక అలియాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించగా, ఈ కార్యక్రమానికి పలువురు నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అనాధాశ్రమంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
తుంకి రమేష్ , మున్సిపల్ కౌన్సిలర్లు ముద్దం సుధాకర్ రెడ్డి, సామల జశ్వంత్ రెడ్డి,
జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి భూమి రెడ్డి నవీన్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ తుంకి బిక్షపతి, మాజీ సర్పంచ్ ఏళ్ళ మల్లేష్, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, నాయకులు కోడూరి దినేష్, బండారి బాబు,తంటం యాదగిరి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు తంటం రాము , ఇప్ప మాధవ రెడ్డి,కొమ్ము వినోద్,కుడుముల వెంకటేష్, ముద్దం వీర రెడ్డి, నీరుడి బాలేష్, పల్లె అశోక్,మహేష్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలి