గోంతేలమ్మ పాట పాడుకున్న తొర్లపాటి ముకిందరావు
మన ప్రగతి న్యూస్ /అశ్వారావుపేట ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలంలోని గోంతేలమ్మ పండగ దొంతికుంట గ్రామం, అంబేద్కర్ నగర్లో,మొదలయింది. పురుషులు, మహిళలు, యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే విశిష్టమైన జానపద పండగ గోంతేలమ్మ పండగ నేపథ్యం ప్రాముఖ్యత ఏమిటంటే పాండవుల యొక్క తల్లి అయిన కుంతి దేవి దళిత ప్రజల యొక్క కులదైవంగా చేసుకొని పూజలు చేస్తారు.ముందుగా చెరువు మట్టిని పూజ చేసి, ఆ మట్టిని గ్రామంలోకి తీసుకొచ్చి,అమ్మవారి ఆకరాన్ని తీర్చిదిద్ది, పసుపు కుంకుమ మరియు తంగేడు, బంతి, గుమ్మడి పువ్వులు,వివిధ రకమైన పూలతో అలంకరించి పూజలు చేస్తారు. గొంతలమ్మ దేవతను పూజిస్తే పాండవుల వంటి సద్గుణవంతులైన సంతానం కలుగుతుందని మరియు కన్యలకు మంచి రూపం,ఉద్యోగం ఉన్న భర్త లభిస్తాడని, మహిళలకు తమ సౌభాగ్యం కోసం సోదరుల యొక్క ఆయురారోగ్యాల కోసం ఆ గ్రామ ప్రజల ఆడపడుచుల కోసం వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.ఈ తొమ్మిది రోజులు గ్రామంలో అందరూ కలిసికట్టుగా కోలాటం ఆడుతు మరియుపి పూజ పాటలు పాడుకుంటూ, ఇలా చెయ్యడం
వల్ల వాళ్ళ గ్రామీణ బంధాలు బలపడతాయని అందరి నమ్మకం.ఈ పండగ ఎప్పుడు జరుపుకుంటారంటే దీపావళి సమయంలో ప్రతిష్టించిన మొదటి రోజు నుండి తొమ్మిది రోజుల వరకు పూజలు జరుపుకొని ఈ పండగ చివర రోజున మేళాల తాళాలతో డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించి భక్తిశ్రద్ధలతో అందుకొని అమ్మవారిని పవిత్రమైన
చెరువు నీళ్లలో నిమజ్జనం చేస్తారు




