వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు టీపీసీసీ అధికార ప్రతినిధిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు, ఏఐసీసీ మీడియా విభాగం ఛైర్మన్ పవన్ ఖేరా సూచనల మేరకు ఈ నియామకం చేపట్టారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

