బ్రేకింగ్ న్యూస్
ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్యటీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకంనిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలిట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళనరహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదంజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వంగాల కళ్యాణి నియామకంపోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్అంగరంగ వైభవంగా గోంతేలమ్మ కోలాట వేడుకలు -దొంతికుంటకార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలిదీపావళి సందర్భంగా లీడ్ గ్రంథాలయంలో పుస్తక ‘దీపం’ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్యటీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకంనిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలిట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళనరహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదంజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వంగాల కళ్యాణి నియామకంపోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్అంగరంగ వైభవంగా గోంతేలమ్మ కోలాట వేడుకలు -దొంతికుంటకార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలిదీపావళి సందర్భంగా లీడ్ గ్రంథాలయంలో పుస్తక ‘దీపం’
వరంగల్

దీపావళి సందర్భంగా లీడ్ గ్రంథాలయంలో పుస్తక ‘దీపం’

మన ప్రగతి న్యూస్/నర్సంపేట:

జ్ఞానానికి ప్రతీక అయిన పుస్తకాన్ని, చీకటిని తొలగించే వెలుగుకు ప్రతీకలైన దీపాలను అనుసంధానిస్తూ దీపావళి పండుగ సందర్భంగా నర్సంపేటలోని లీడ్ గ్రంథాలయంలో వినూత్నంగా అలంకరణ చేపట్టారు.పూలతో అందంగా తీర్చిదిద్దిన దీపం, పుస్తకం ఆకారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటి చుట్టూ వెలిగించిన ప్రమిదలు జ్ఞానజ్యోతిని, విద్యా వెలుగులను ప్రతిబింబించాయి. అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే వెలుగును సమాజమంతా వ్యాపింపజేయడంలో పుస్తకాలు, గ్రంథాలయాల పాత్ర ఎంతటి గొప్పదో ఈ అలంకరణ చాటిచెప్పింది.
దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి జీవితంలో జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలని లీడ్ గ్రంథాలయం వ్యవస్థాపకులు కాసుల రవికుమార్, శోభారాణి
అన్నారు. వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వీరిని పలువురు అభినందించారు.

అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు