మన ప్రగతి న్యూస్ నర్సంపేట
పట్టణంలో అంగరంగ వైభవంగా దీపావళి సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మామిడి తోరణాలతో , పూలతో తమ ఇంటిని అలంకరించి ముత్యాల ముగ్గులు వేసి, ఇంటి ముందర దీపాలను వెలిగించి టపాసులను పేల్చి వారి ఆనందాన్ని వెలిబుచ్చారు. దీపావళి పూజలో భాగంగా పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తమ కోరికలను తీర్చాలని ఆ దేవదేవుని ప్రార్థించారు.

