బ్రేకింగ్ న్యూస్
భూముల రీ సర్వే పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలి.. _అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలిఅంగరంగ వైభవంగా దీపావళి సంబరాలుఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్యటీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకంనిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలిట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళనరహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదంజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వంగాల కళ్యాణి నియామకంపోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్భూముల రీ సర్వే పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలి.. _అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలిఅంగరంగ వైభవంగా దీపావళి సంబరాలుఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్యటీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకంనిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలిట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళనరహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదంజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వంగాల కళ్యాణి నియామకంపోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్
తెలంగాణ

డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలతో మెడికల్ షాపుల యజమానుల్లో గుబులు…

తనిఖీల సమయంలో షాపులు మూసివేత…

అసలు లోగుట్టు ఏమిటి? నిబంధనలు ఉల్లంఘించరా… లేక తనిఖీల భయమా?

డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలతో మెడికల్ షాపుల యజమానుల్లో గుబులు!తనిఖీల సమయంలో షాపులు మూసివేత.. అసలు లోగుట్టు ఏమిటి? నిబంధనలు ఉల్లంఘించారా.. లేక తనిఖీల భయమా?మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:- ఆత్మకూరు పట్టణ కేంద్రంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీల నేపథ్యంలో కొన్ని మెడికల్ షాపుల యజమానులు తమ దుకాణాలను అకస్మాత్తుగా మూసివేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన ఔషధ దుకాణాలు తనిఖీల సమయంలో మూతపడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు తనిఖీలకు ముందే కొన్ని షాపులు ఎందుకు మూసివేశారు? తనిఖీల్లో బయటపడతాయనే భయంతోనే దుకాణాలు మూసివేశారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.ఔషధాల విక్రయానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ప్రతి మెడికల్ షాపు తప్పనిసరిగా పాటించాలి. మందుల నిల్వలు, గడువు ముగిసిన ఔషధాలు, వైద్యుల చీటీ లేకుండా విక్రయించే మందులు, ఫార్మసిస్ట్ అందుబాటు వంటి అంశాలపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఔషధాల విక్రయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావుండకూడదు.ఇటీవల పట్టణంలో కొన్ని మెడికల్ షాపుల్లో గడువు ముగిసిన మందుల విక్రయాలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీల సమయంలో షాపులు మూసివేయడం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. అయితే షాపులు మూసివేయడానికి గల అసలు కారణాలు ఏమిటో అధికారుల విచారణలోనే స్పష్టత రావాల్సి ఉంది.తనిఖీలు అంటే భయపడాల్సిన అవసరం లేని వ్యాపారులు షాపులు మూసివేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిబంధనల ప్రకారం వ్యాపారం చేస్తున్నప్పుడు తనిఖీలకు సహకరించాలి కదా? తనిఖీల సమయంలో దుకాణాలు మూసివేస్తే అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది.*_ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు!_*ఔషధాల విక్రయం అనేది సాధారణ వ్యాపారం కాదు.. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో ముడిపడి ఉన్న బాధ్యత. అందువల్ల డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అధికారులు కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా, పట్టణంలోని అన్ని మెడికల్ షాపులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

భూముల రీ సర్వే పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలి.. _అదనపు కలెక్టర్ గడ్డం నగేష్