భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
మన ప్రగతి న్యూస్/అచ్చంపేట
నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో దారుణం చోటు చేసుకు సుకుంది. చెన్నంపల్లి గ్రామానికి చెందిన రాములు ఎల్లమ్మ దంపతులు కుటుంబ కలహాలతో ఎల్లమ్మ రాములుని గత రాత్రి గోడ్డలితో దారుణంగా నరికి చంపివేసింది. కుటుంబ కలహాల వల్లనే ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. రాములు గొర్రెల కాపరిగా జీవిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు లింగాల పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం లింగాల ఆసుపత్రికి తరలించారు హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.