Breaking News

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన ప్రగతి న్యూస్/కామారెడ్డి జిల్లా ప్రతినిధి

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్గల్ లోని ఎస్ సి వెల్ఫేర్ హాస్టల్ ను సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన క్రొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వారి అభ్యున్నతి ధ్యేయంగా పాటుపడుతుందన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని అభివృద్ధి పథంలో నడవాలన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, ఏకాగ్రత చాలా అవసరమని క్రమశిక్షణతో కూడిన విద్య ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుతుందన్నారు. చదువులో రాణించి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. హాస్టల్ మొత్తం కలియతిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అయ్యప్పస్వామి ఆశీర్వాదంతో నర్సంపేట నియోజకవర్గం,తెలంగాణ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలి