Breaking News

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

_ తెర్లుమద్ది గ్రామ సర్పంచ్
వార్డు సభ్యులు…

మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్

రాజన్న సిరిసిల్లలో సోమవారం నుంచి ప్రజావాణి యథావిధి

ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలోని నక్కవాగు కు మల్లన్నసాగర్ నీటిని విడుదల చేసి ప్రవాహం కొనసాగించాలని సిద్ధిపేట నుండి తెర్లుమద్ది మీదుగా కామారెడ్డి వరకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని
ఆదివారం నాడు తెర్లుమద్ది గ్రామ సర్పంచ్ బైతి దుర్గమ్మ – బైతి నవీన్ వార్డు సభ్యులు సిద్ధిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు,ని వారి క్యాంపు కార్యాలయంలో కలసి,వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నక్కవాగు పరివాహక ప్రాంతాల్లోని రైతులు సుభిక్షంగా ఉండాలని, భూగర్భ జలాలు పెరగడానికి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరగా వారు స్పందిస్తూ తక్షణమే స్పందించి ఈఆన్ సి తో మాట్లాడి సమస్యను పరిష్కరించి, నీరు విడుదల అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారువార్డు సభ్యులు గోక దివ్య స్వామి అంతడుపుల మంజుల దేవయ్య, కొమ్మెట రాజలింగయ్య గ్రామ పెద్దలు
కొమ్మెట రాజు,సుద్దల బాలకిషన్ పాల్గొన్నారు.