
మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:
చింతకాని మండలం జగన్నాధపురంలో జులై 10న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ విజయవంతానికి కాంగ్రెస్ పార్టీ ఏన్కూరు మండల కమిటీ ఆధ్వర్యంలో నేడు (జూలై 9) మధ్యాహ్నం 3 గంటలకు ఏన్కూరులోని కమ్మవారి కళ్యాణ మండపంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హాజరవుతారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్వర్ణ నరేందర్ తెలిపారు.ఈ సమావేశంలో రైతు ఆశీర్వాద సభకు సంబంధించిన ఏర్పాట్లు, మండల స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ, కార్యకర్తల బాధ్యతలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలోని సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు, ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, బూత్ లెవల్ ఏజెంట్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
