బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

రామన్నపేటలో విషాదం.. నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి

మన ప్రగతి న్యూస్ /వేములవాడ నియోజకవర్గం:

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో శనివారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిప్పని జలంధర్, శిరీష దంపతుల రెండేళ్ల కుమార్తె విశ్వైక ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నుంచి ఇంటికి వచ్చిన అనంతరం తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా, చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన తండ్రి వెంటనే చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసింది.కళ్ల ముందే రెండేళ్ల కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటనతో రామన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం