Breaking News

సీఎం రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి మంత్రి పొంగులేటి శుభాకాంక్షలు..

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ముఖ్య మంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడు తూ.. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఒక నాయకుడి వ్యక్తిగత ప్రయాణం మాత్రమే కాకుండా.. ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగిన నిరంతర పోరాటానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల మధ్య నుంచి ఎదిగి, వారి విశ్వాసాన్ని చూర గొని, ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ తనదైన రాజకీయ ముద్ర వేసుకున్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారని కొనియాడారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రజా ప్రయోజనాల కోసం ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా అంకితభావంతో పనిచేశారని, అదే నిబద్ధత ఆయనను రాష్ట్ర అత్యున్నత పదవికి చేర్చిందన్నారు. ప్రస్తుతం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా ముఖ్యమంత్రి అంది స్తున్న నాయకత్వం తెలంగాణ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజల విశ్వాసాన్ని గెలుచు కున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భవిష్యత్తులోనూ అదే నమ్మకాన్ని నిలబెట్టు కుంటూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా, మరిన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు.

రామన్నపేటలో విషాదం.. నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి