Breaking News

రాజన్న సిరిసిల్లలో సోమవారం నుంచి ప్రజావాణి యథావిధి

మన ప్రగతి న్యూస్ /వేములవాడ

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను స్వీకరించి సంబంధిత శాఖల ద్వారా వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..