-కొలగాని శ్రీనివాస్
-రూ.49 లక్షల అభివృద్ధి పనుల ఫైల్ పై తొలి సంతకం చేసిన మేయర్.
-అభినందనలు తెలియజేసిన బిజెపి శ్రేణులు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్.
మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్టాఫర్:
కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ ఆదివారం రోజున మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు,డిప్యూటీ మేయర్ సునీల్ రావు,మున్సిపల్ కమిషనర్,కార్పొరేటర్ లు, మున్సిపల్ సిబ్బంది మేయర్ ను సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మేయర్ కోలగని శ్రీనివాస్ రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి అవసరాల కోసం రూ.49 లక్షల అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైల్ మీద మొదటి సంతకం చేశారు.ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు మేయర్ గా అవకాశం కల్పించిన కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్,రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు జాతీయ,రాష్ట్ర,జిల్లా నాయకత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.బీజేపీ పై నమ్మకంతో ప్రప్రధమంగా కరీంనగర్ నగరపాలక సంస్థ బాధ్యతలను అప్పజెప్పిన పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో నగరపాలక సంస్థలోని 66 డివిజన్ల అభివృద్ధి కోసం నిరంతర కృషి చేస్తానన్నారు.ప్రజలకు మౌలిక సదుపాయాలు,పౌర సేవలు వేగవంతంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.కరీంనగర్ నగరపాలక సంస్థను ఆదర్శవంతంగా,మరింత సుందర నగరంగా తీర్చిదిద్దడానికి అందరికి సహకారంతో ముందు కొనసాగుతామని చెప్పారు.

