Breaking News

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి :

నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో నిర్వహించిన మల్లన్న జాతరకు వెళ్లిన రజక బీసీ కుటుంబంపై కొందరు నిర్వాహకులు దాడిచేసి రెండు నెలల శిశువు మృతికి కారణమయ్యారని ఆ దుండగులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రజ్ఞాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ సందర్భంగా రజక సంఘం యువకులు పెద్ద ఎత్తున పాల్గొని టెంట్ హౌస్ నర్సింలు,రాములు కనకరాజు,సాయిబాబు, ఉపేందర్,కరుణాకర్,దశరథ, దుర్గేశ,మాట్లాడుతూ బాధితురాలు చంద్రకళ కుటుంబ సభ్యులు మల్లన దర్శన కోసం వెళ్లగా వారిని ఆలయంలోకి అనుమతించలేదన్నారు.ఎందుకని కారణం అడిగితే వాగ్వివాదం జరిగి దాడికి దిగారు అన్నారు.దాడి సమయంలో చిన్నారిని కాలితో తన్నడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది అన్నారు .ఈ ఘటనలో కుమ్మర గ్రామ పెద్దలు తుకారం రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి ,శ్రీకాంత్ రెడ్డి,సతీష్ రెడ్డి ,కన్నిరెడ్డి,ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల అనుచరులని బాధితులు ఆరోపిస్తున్నారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెల్లగా తమ ఫిర్యాదును స్వీకరించలేదని ప్రత్యుత్తరంగా బాధితులపైనే కేసులు నమోదు చేయడం దారుణం అన్నారు.ఈ సందర్భంగా ప్రజ్ఞాపూర్ గ్రామ రజక సంఘం నాయకులు మాట్లాడుతూ ఇలాంటి దారుణాలు పునరావత్రం కాకుండా దుండగులపై అట్రాసిటీ కేసు ఫైల్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం – ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..