మన ప్రగతి న్యూస్ /వేములవాడ:
వేములవాడ పట్టణంలో జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల, వివేకానంద జూనియర్ కళాశాల, సుమిత్ర శ్రీ వోకేషనల్ జూనియర్ కళాశాలల పరిసరాల్లో బీఎన్‌ఎస్ సెక్షన్ 189 కింద ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25 వ తేదీ నుంచి మార్చి 18 వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని.. ఈ మేరకు తహశీల్దార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతలు కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సీఐ తెలిపారు. నిషే ధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

