Breaking News

పంచాయతీ సెక్రెటరీ కి ఘన సన్మానం

మన ప్రగతి న్యూస్/గజ్వేల్ డివిజన్ ప్రతినిధి:

గజ్వేల్ మండల పరిధిలోని కొడకండ్ల గ్రామంలో గత నాలుగున్నర సంవత్సరాలు పంచాయతీ సెక్రటరీ గా విధులు నిర్వహించి బదిలీపై వర్గల్ మండలం మైలారం గ్రామానికి వెళ్తున్న శ్రీకాంత్ ను మంగళవారం గ్రామ సర్పంచ్ లక్ష్మీ కొండయ్య, ఉప సర్పంచ్ జ్యోతి నర్సింలు ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు, అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రణాళికలు రచించడంలో ముఖ్యపాత్ర పోషించారు,ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి