ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు దారా రమేష్…
మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దారా రమేష్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమని, అయితే ఒత్తిడికి లోనుకాకుండా సమయ పాలన పాటిస్తూ, పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటూ పరీక్షలకు సరైన సమయంలో హాజరవ్వాలని సూచించారు. కష్టపడి చదివిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుందని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు ధైర్యం చెప్పి ఉత్సాహ పరచాలని పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులై, ఉన్నత విద్యలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా దారా రమేష్ ఆకాంక్షించారు.

