మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :
మాజీ సర్పంచ్ స్వర్గీయ చిట్యాల రామచంద్రం పాలకుర్తి గ్రామానికి చేసిన సేవలు చిరస్మరణీ
యంగా నిలుస్తాయని కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు అన్నారు. మంగళవారం రామచంద్రం ప్రధమ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో గల శివ గార్డెన్ లో ఏర్పాటుచేసిన ప్రధమ వర్ధంతి సభలో ఆయన చిత్రపటానికి మనవరాలు ఆశ్రిత, కొడుకు సంపత్ కోడలు శ్వేతా తోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రామచంద్రం 20 సంవత్సరాలు పాలకుర్తి గ్రామ సర్పంచిగా పనిచేసే గ్రామ అభివృద్ధికి బాటలు వేశారని ఆయన చేసిన పనులే నేడు పాలకుర్తి మండల కేంద్రానికి అభివృద్ధికి దోహదపడుతు
న్నాయని అన్నారు. పాలకుర్తి గ్రామానికి నాలుగు వైపులా 100 ఫీట్ల రోడ్ల,అంగడి ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధికి బాటలు వేశారని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గార్గే,రజక చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గంపల శ్రీనివాస్, రజక చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాడరాజు యాకన్న,రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగారపు ఉప్పలయ్య,
సిపిఐ ఎంఎల్ రెడ్ ప్లాగ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాన్యపు భుజేందర్, తెలంగాణ ఉద్యమ కారుల పోలాస సోమన్న,అయితే రాజు,
గుమ్మడి రాజు బిక్షపతి,గాదెపాక సెక్రటరీ యాకయ్య, సురేష్,చిట్యాల కొండయ్య,
శనిగరపు రాజు తదితరులు పాల్గొన్నారు.

