Breaking News

మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం-

సమష్టిగా నివారిద్దాం ఎస్సై మధు ప్రసాద్

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి:

పెండింగ్ బిల్లులు చెల్లించాలి..

మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని స్థానిక ఎస్సై మధు ప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ గ్రామంలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్‌ నాశనమవుతుందన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసేవారి ఆట కట్టించడానికి పోలీస్‌ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని, టోల్‌ఫ్రీ నెంబర్‌ 14500 లేదా సమీపంలో పోలీస్‌ వారికి తెలియజేయాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది , అంబేద్కర్ నగర్ గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు.