దామెర ఎస్సై కుంక అశోక్
మన ప్రగతి న్యూస్ /హనుమకొండ జిల్లా ప్రతినిధి :రోడ్డు భద్రతా- ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమంలో భాగంగా
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు వాహనదారులలో రవాణా నియమాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర డి.జి.పి. శివధర్ రెడ్డి, ఐ పీ ఎస్, వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐ పీ ఎస్ ఉత్తర్వుల మేరకు వారం రోజుల కార్యక్రమం లో భాగంగా మంగళవారం దామెర పోలీసులు మండల కేంద్రంలో హెల్మెట్ ప్రాముఖ్యత పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దామెర ఎస్.ఐ. కొంక అశోక్ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత గురించి దరించకపోతే కలిగే నష్టాల గురించి తెలిపి వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని లేనిచో మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా చర్యలు తీసుకుంటామని వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రజలందరూ ఆర్రివ్- ఆలీవ్ – 2026 కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతా- ప్రమాదాల నివారణ పై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు.

