Breaking News

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..

_ 16 కేంద్రాల్లో పరీక్షలు హాజరుకానున్న 8,106 మంది ఫస్ట్, సెకండియర్ విద్యార్థులు*

_ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధం..

మన ప్రగతి న్యూస్ /
రాజన్న సిరిసిల్ల, జిల్లా స్టాపర్:

ఈ నెల 25 వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల్లో సర్వం సిద్దం చేశారు. పరీక్ష సమయానికంటే విద్యార్థులు గంట ముందే చేరుకోవాలి. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధం. ఈ ఏడాది పరీక్ష కేంద్రాల్లోకి నిమిషం ఆలస్యమైన అనుమతించకపోవడం నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. నిర్ణీత సమయం 09.00 గంటల తరువాత ఐదు నిముషాల లోపు చేరుకోవాలి.

_ ఉదయం 9 గంటల నుంచి..

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4046, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4060 పరీక్షకు హాజరు కానున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల (మార్చి 16వ తేదీ) దాకా నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు మొదలై మధ్యాహ్నం 12 గంటల వరకు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బాయ్స్ సిరిసిల్ల, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గర్ల్స్ సిరిసిల్ల, సహస్ర జూనియర్ కాలేజీ సిరిసిల్ల, సాయిశ్రీ జూనియర్ కాలేజీ సిరిసిల్ల, టీజీఎస్ డబ్య్లూఆర్జేసీ బద్దెనపల్లి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బాయ్స్ వేములవాడ, వివేకానంద జూనియర్ కాలేజీ వేములవాడ, సుమిత్ర శ్రీ ఒకేషనల్ జూనియర్ కాలేజీ వేములవాడ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోనరావుపేట, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఇల్లంతకుంట, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ చందుర్తి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రుద్రంగి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గంభీరావుపేట్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ముస్తాబాద్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎల్లారెడ్డిపేట్, రాచర్ల జూనియర్ కాలేజీ గొల్లపల్లిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశారు. మూడు సెట్ల ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్లకు చేర వేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 8333916289 అందుబాటులో ఉంటుంది.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

144 సెక్షన్ అమలు..

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల సమీపంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు. హాల్ టికెట్లు TGBIE వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్లు వెంట తీసుకురావాలని తెలిపారు.

_ పర్యవేక్షణకు బృందాలు..

పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. 350 నుంచి 400 మంది ఇన్విజిలెటర్లను నియమించారు.ప్రశాంతంగా పరీక్షలు రాయాలి,పరీక్షలు రాసే విద్యార్థులు కేంద్రాలకు గంట ముందే అనుమతిస్తారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు ఒత్తిడిలోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి..