Breaking News

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం

ట్రాఫిక్ నియంత్రణ ర్యాలీ మిర్యాలగూడ

మన ప్రగతి న్యూస్/ మిర్యాలగూడ

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో అధికంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యని నియంత్రించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పట్టణంలోని వ్యాపారస్తులకు షాపింగ్ మాల్స్ కి ప్రజలకు ప్రయాణికులకు ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు మున్సిపల్ సిబ్బంది, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ,పోలీస్ అధికారులు ప్రజా ప్రజా ప్రతినిధులు, సంఘాల కలసి పట్టణంలోని ఫ్లైఓవర్ నుంచి బస్టాండ్ డాక్టర్స్ కాలని గణేష్ మార్కెట్ పెద్ద బజార్ గుండా రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి బస్టాండ్వరకు ట్రాఫిక్ నియంత్రణ అవగాహన ర్యాలి నిర్వహించడం జరిగింది. ఈ సంద్భంగా మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో రోజు రోజుకు జనాభా, వ్యాపార సంస్థలు పెరుగుతున్నప్పటికి పెరుగుతున్న జనాభా ప్రకారం కావాల్సిన వసతులు మాత్రం గత 20 సంవత్సరాలుగా ఏమాత్రం మారలేదు అని అన్నారు.
మన మిర్యాలగూడ పట్టణంలో ఒకే ఒక్క ప్రధాన రహదారి ఉండటం మూలాన వ్యాపార సంస్థలు అన్ని ఒకే రోడ్డుపై ఉండటం మూలాన రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య అధికమవుతుంది అని అన్నారు.
గత వైఫల్యాల గురించి చర్చించుకోవడం మానేసి సమస్య పరిష్కారం కోసం మనం చేయాల్సిన కార్యాచరణ ఏంటి అని ఆలోచించి గత నెల రోజులుగా ప్రతీ రోజూ రోడ్డుపై ఉన్న వ్యాపారస్తులకు , ప్రజలకు తగు సూచనలు చేస్తూ పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు శ్రమిస్తూ ఉన్నారు.
కేవలం ప్రజా ప్రతినిధులను అధికారులను సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించడం, విమర్శించడం కాకుండా తమ వంతు బాధ్యతగా ప్రతీ పౌరుడు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తూ పరిష్కారం వెతకాలి అని అన్నారు. అందరం బాధ్యతతో కలసి పనిచేస్తేనే ఈ సమస్యకి పూర్తి పరిష్కారం జరుగుతుంది అని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు మేము తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వ్యాపారులను ప్రజలను తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది పెట్టినా.. దీని ఫలితం భవిష్యత్తులో తెలుస్తుంది అన్నారు
ఇప్పుడు నన్ను విమర్శించినా పర్వాలేదు కానీ భవిష్యత్తులో నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరే అభినందిస్తారు అని అన్నారు.
ప్రజలు ప్రయాణికులు వ్యాపారులు ప్రతిఒక్కరూ అధికారులకు సహకరించండి అందరం కలిసి ట్రాఫిక్ సమస్యని సునాయాసంగా పరిష్కరించగలం అనే సందేశాన్ని పంపేందుకే ఈ అవగాహన ర్యాలీ నిర్వహించాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీ విజయవంతం చేసిన పోలీస్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు సంఘాల నాయకులకు రైస్ మిల్లర్స్ కి డాక్టర్స్ యూనియన్ ప్రజలకు బ్రదర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు..