Breaking News

మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యంఫోర్ ఆర్మీ ఆధ్వర్యంలో సంక్రాంతి పోటీలు

మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు:

మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి దేహదారుద్య పతిష్టత్వానికి క్రీడ పోటీలు ఎంతో ప్రాముఖ్యమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి, మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు లు అన్నారు. మండలంలోని మునిగలవీడు గ్రామంలో ఫోర్ ఆర్మీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని క్రీడలు నిర్వహించడం జరిగింది పొటిలో విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం రాత్రి బహుమతి అందజేసే కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా యాదవ రెడ్డి, హెచ్ వెంకటేశ్వర్లు, నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఇసంపల్లి వెంకటేష్ లతో కలిసి బహుమతులు క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడారంగంలో రాణించడం చాలా శుభ పరిణామం ఫోర్ ఆర్మీ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారికి పూర్తి సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా బి ఎస్ పి పార్టీ ప్రెసిడెంట్ ఇసంపల్లి ఉపేందర్,బంజర కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బొమ్మోజు అనిల్ , నెల్లికుదురు మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరుడు అనంత రెడ్డి, నెల్లికుదురు మండలం సిపిఎం పార్టీ కార్యదర్శి ఇసంపల్లిసైదులు, జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు నల్లని పాపారావు,బొల్లెపల్లిసతీష్,ఇసంపల్లి యాకయ్య, ఇసంపల్లి మల్లయ్య, ఇసంపల్లి వెంకన్న, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మూరగుండ్ల ఎల్లయ్య, శ్రీకాంత్, తరుణ్, నవీన్, మదన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం