బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
తెలంగాణ

అమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..

నాగయ్యపల్లె లో విషాదం.. ఫిట్స్‌తో యువకుడి ఆకస్మిక మృతి.

మన ప్రగతి న్యూస్ /వేములవాడ రూరల్:

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన చెట్టిపల్లి శ్రీకాంత్ (36) ఫిట్స్ రావడంతో ఆకస్మికంగా కన్నుమూశాడు. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకుడు ఒక్కసారిగా అందరికీ దూరం కావడంతో కుటుంబంలోనే కాక గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికుల వివరాల ప్రకారం, అవివాహితుడైన శ్రీకాంత్‌ కు మంగళవారం రోజున అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో స్పృహ కోల్పోయి కుప్పకూలాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామ స్థులు వెంటనే చికిత్స నిమిత్తం వేములవాడ లోనీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే మార్గమధ్యంలోనే ఆయన మృతి చెంది నట్లు వైద్యులు నిర్ధారించారు. చేతికి అందిన కొడుకు అకాల మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి రాజేశ్వరి గుండెలవిసేలా విలపించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. కుమారుడి మృతదేహాన్ని హత్తుకుని ఆమె రోదించిన దృశ్యాలు హృదయాలను కలచివేశాయి. బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ శ్రీకాంత్‌ కు తుది వీడ్కోలు పలికా రు. యువకుడి అకాల మరణంతో నాగాయపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎప్పుడూ అందరితో కలివిడిగా ఉండే శ్రీకాంత్ ఇక లేడనే వార్త గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల గ్రామస్థు లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని తెలియజేశారు.