బ్రేకింగ్ న్యూస్
పోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్పోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
తెలంగాణ

స్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలు

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

పోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహం

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం చేపట్టిన పాదయాత్ర కేవలం ఆరంభం మాత్రమేనని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్–హెచ్–2843) రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగే రఘు, బి. రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత నెల 22న ప్రారంభమైన పాదయాత్ర శనివారం ఖమ్మం నియోజకవర్గంలో ముగిసింది. ఎస్ఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలంలో నిర్వహించిన ముగింపు సభలో నేతలు మాట్లాడుతూ…ముందుగా ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన జర్నలిస్టులు కూరాకుల గోపి, సత్యానందం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో టీడబ్ల్యూజేఎఫ్ నేతలు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు చిరకాల వాంఛగా ఉన్నాయని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు సైతం సిద్ధమని హెచ్చరించారు. జర్నలిస్టులే జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు.మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాంజిల్లా మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉందని పేర్కొన్నారు.ప్రతి పోరాటానికీ అండగా ఉంటాంజర్నలిస్టుల ప్రతి పోరాటానికీ మద్దతుగా నిలుస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకుడు ఎర్ర బాబు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నేత సీవై పుల్లయ్య, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మధు, సామాజిక తెలంగాణ నాయకుడు డాక్టర్ కేవీ కృష్ణారావు, బీఎస్పీ నాయకుడు ఉపేందర్ సాహు, ముస్లిం లీగ్ నాయకుడు బాజీబాబా, తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సంఘం నాయకుడు అస్లాంఖాన్ తదితరులు ప్రకటించారు.అడుగడుగునా సంఘీభావంఖమ్మం అర్బన్, రూరల్, రఘునాథపాలెం తహసీల్దార్ కార్యాలయాలకు పాదయాత్రగా వెళ్లి వినతిపత్రాలు సమర్పించారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభమైన యాత్ర కాల్వొడ్డు, మయూరి సెంటర్, వైరా రోడ్, ఇల్లందు క్రాస్‌రోడ్ మీదుగా రఘునాథపాలెం తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. పాదయాత్రకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. భవిష్యత్ పోరాటాలకు కూడా అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు,టీబీజేఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, మానుకొండ రవికిరణ్, వ్యవస్థాపక అధ్యక్షుడు పారుపల్లి కృష్ణారావు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు నలుబోల మధుశ్రీ, సీహెచ్ బాలకృష్ణ, చక్రవర్తి, యాకేష్, జానీపాష, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి మాధవరావు, ఫయాజ్, గణేష్, శరత్, గోపీ, రాంబాబు, అర్షద్, కర్ణ, లక్ష్మారెడ్డి, మోహన్‌రావు, భవాని, వేణు, గంగాధర్, జి. వెంకటేశ్వర్లు, కిరణ్, పవన్, వెంకటేశ్, అంజయ్య, జావీద్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.