మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:

పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం విధులు నిర్వహించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు.అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.జూలూరుపాడులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్నేహపూర్వక పోలీసింగ్ విధానం కొనసాగిందని, ప్రస్తుతం కొందరు పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.భవిష్యత్‌లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, ప్రస్తుతం తప్పుడు చర్యలకు పాల్పడుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిని వదిలిపెట్టబోమని పువ్వాడ హెచ్చరించారు. పోలీసులు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని హితవు పలికారు.
