బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
తెలంగాణ

ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:

ఆదివాసీ గిరిజనుల దశాబ్దాల కలలు, ఆకాంక్షలను సాకారం చేసిన ఘనత బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసి గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు.గిరిజనుల చిరకాల డిమాండ్ల పరిష్కారానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూములకు పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేసి గిరిజనుల హక్కులను పరిరక్షించామని పేర్కొన్నారు.మా నాటే మా రాజ్‌.. మా తండాలో మా రాజ్యం అనే ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ అనేక గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు. అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పిస్తూ హక్కు పత్రాలు అందజేశామని తెలిపారు.విద్య,ఉద్యోగ రంగాల్లో గిరిజనుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామని అన్నారు. గిరిజన సబ్‌-ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయడంతో పాటు గిరిజన సహకార సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు.అటవీ ఉత్పత్తులకు గిరి బ్రాండ్‌ను ప్రోత్సహించి మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించడం ద్వారా గిరిజనుల ఆర్థికాభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఆదివాసీ గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం,స్వయంపాలన,ఆర్థికాభివృద్ధి కోసం కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన కృషి చిరస్మరణీయమని పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్