మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

అబద్ధాలు, విద్వేషాలు, దూషణలతో కాలక్షేపం చేస్తూ రాష్ట్ర పరిపాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. సిరిసిల్ల సభలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆవేశంతో బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గౌరవం, సంస్కారం పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సి ఉందన్నారు. ప్రజా సమస్యలకు సమాధానం చెప్పాల్సిన సమయంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
