- విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సీజీఆర్‌ఎఫ్ సమావేశం
మన ప్రగతి న్యూస్ / ఇనుగుర్తి:
ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సీజీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కార సమావేశం నిర్వహించనున్నట్లు చిన్న jముప్పారం సబ్‌స్టేషన్ లైన్మెన్ లకపతి తెలిపారు. సెప్టెంబర్ 17న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలోని సంబంధిత గ్రామాల విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సరఫరా, విద్యుత్ కనెక్షన్లు, మీటర్లు, బిల్లులు, ఇతర విద్యుత్ సేవలకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులను సమావేశంలో నేరుగా సీజీఆర్‌ఎఫ్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చన్నారు.గ్రామాల్లో నెలకొన్న సామూహిక విద్యుత్ సమస్యలను కూడా ఫోరం దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉందని తెలిపారు. సంబంధిత గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు ఈ సమావేశం గురించి ప్రజలకు తెలియజేసి, సమస్యలు ఉన్న విద్యుత్ వినియోగదారులు తప్పనిసరిగా హాజరయ్యేలా సహకరించాలని కోరారు.విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను రాతపూర్వకంగా తీసుకువచ్చి సీజీఆర్‌ఎఫ్ సమావేశంలో సమర్పించాలని చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ లైన్మెన్ లకపతి సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యుత్ సమస్యలకు పరిష్కారం పొందాలని కోరారు.

