బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
తెలంగాణ

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

పంచాయతీ రాజ్ చట్టం కింద సీజింగ్:
బిఎన్ఎస్ చట్టం కింద కఠిన హెచ్చరిక

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

మండల కేంద్రంలోని “నగేశ్ నూనె మిల్లు”లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంపై గ్రామ పంచాయతీ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా, కనీస భద్రతా ఏర్పాట్లు పాటించకుండా అనధికారికంగా నడుపుతున్న ఈ నూనె మిల్లును శుక్రవారం (21-08-2026) తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం స్థానిక సర్పంచ్ నాగెల్లి జ్యోతి సమక్షంలో పంచాయతీ కార్యదర్శి నూతనకంటి ప్రశాంత్ శుక్రవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి నూతనకంటి ప్రశాంత్ మాట్లాడుతూ, గ్రామ పరిధిలో సరైన అనుమతులు లేకుండా వ్యాపారాలు కొనసాగించినా, ప్రజా భద్రతను విస్మరించి ప్రమాదకరంగా మిల్లులు నడిపినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల కవిత స్థానిక మహిళా పొదుపు సంఘంలో సీఏ (మహిళా సంఘం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) గా పనిచేస్తున్నారు.తేదీ 19-08-2026 నాడు కవిత నూనె పట్టించుకోవడానికి రాగా, మిషన్ పళ్లచక్రాల్లో చేయి ఇరుక్కుపోవడంతో ఆమె చేయి తెగి తీవ్ర అంగవైకల్యం సంభవించింది. మిల్లు యజమాని జక్కుల నగేశ్ ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా అనధికారికంగా మిల్లు నిర్వహిస్తున్నారు.సరైన అనుమతులు లేకపోవడం, భద్రతా లోపాలపై సమాధానం చెప్పాలని పంచాయతీ కార్యాలయం నుండి 20-08-2026న సదరు మిల్లు నిర్వాహకుడైన జక్కుల నగేష్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.నోటీసు ఇచ్చిన 24 గంటల గడువులోగా ఎలాంటి సంతృప్తికర వివరణ ఇవ్వకపోవడంతో, ప్రజా భద్రత దృష్ట్యా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, అధికారులు పంచుల సమక్షంలో మిల్లు ప్రాంగణాన్ని సీజ్ చేశారు.సీలు చేసిన మిల్లు ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించినా, తాళాలు/సీలు విరగ్గొట్టినా లేదా యంత్రాలను తరలించే ప్రయత్నం చేసినా బిఎన్ఎస్ చట్టం ప్రకారం నాన్-బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. .ప్రమాదానికి కారణమైన మిల్లు యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ నాగెల్లి జ్యోతి స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

.