Breaking News

వేములవాడలో భారీగా మద్యం స్వాధీనం

ఒకరిపై కేసు నమోదు

మన ప్రగతి న్యూస్ /వేములవాడ

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

వేములవాడ పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మద్యం నిల్వలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ పోలీస్ యంత్రాంగం పట్టణంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు మరియు టిన్‌లు బయటపడ్డాయి.
సుమారు రూ. 54,589/-.విలువ,
శాస్త్రి నగర్‌కు చెందిన కోలా మారుతి తన నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై అక్రమ రవాణా మరియు నిల్వ కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, అనుమతి లేకుండా మద్యం విక్రయించినా లేదా నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.