Breaking News

అయ్యప్పస్వామి ఆశీర్వాదంతో నర్సంపేట నియోజకవర్గం,తెలంగాణ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలి

ఎమ్మెల్యే దొంతి

అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో నర్సంపేట నియోజకవర్గం ప్రజలు తెలంగాణ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి అన్నారు.


నర్సంపేట శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 24వ మండల పూజ మహోత్సవాల్లో భాగంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, సూర్య యాగం, వరునయాగం, అయ్యప్ప స్వామి అభిషేకం పడిపూజ కార్యక్రమాలను నిర్వహించారు.దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా నియోజకవర్గ ప్రజలంతా అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు సాగాలని పంటలు విరివిగా పండి అధిక దిగుబడి రావాలని ప్రజలంతా మానసిక ఆర్థిక అభివృద్ధి చెందాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. అనంతరం దేవాలయ పునర్నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన దాతలను శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దేవాలయ కమిటీ పడిపూజ అన్నదాన దేవాలయ నిర్మాణ దాతలు అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.