Breaking News

ఎల్కతుర్తి ఎస్ఐపై వేటు

విధుల్లో నుంచి ఎస్ఐ రాజ్ కుమార్ సస్పెన్షన్..

ఉత్తర్వులు జారీ చేసిన సిపి అంబర్ కిషోర్ ఝా..

మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్సై రాజ్ కుమార్ పై వేటు పడింది. విధుల్లో నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై రాజ్ కుమార్ పై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు, భూతగాదాల్లో తలదూర్చుతున్నాడని సమాచారం ఉన్నతాధికారులకు చేరినట్లు సమాచారం. ఇటీవల అక్రమ ఆస్తులు కూడబెట్టారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో ఎస్ఐపై సస్పెన్స్ వేటుపడటం డిపార్ట్మెంట్లో చర్చనీయాంశమైంది. కమిషనరేట్ పరిధిలో మరికొందరిపై త్వరలోనే సస్పెన్షన్ వేటుపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.