మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారన్న వేళ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ సమస్యలపై సీఎంకు వారు వినతి పత్రం అందించారు. అయితే.. కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం సాగుతున్న వేళ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎంను కలవడం హాట్ టాపిగ్ గా మారింది. వీరు పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. ఈ అంశంపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.