Breaking News

సంక్షేమ పథకాలు జర్నలిస్టుల అందరికీ అందాలి

-టీఎస్ జేయు అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని

జర్నలిస్ట్ రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలి

చిన్న పత్రికల ఎంపానెల్మెంట్ వెంటనే చెపట్టాలి

జర్నలిస్ట్ పెన్షన్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

టీఎస్జేయు కోరుట్ల
అధ్యక్షుడిగా జోరిగా శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శిగా తరి రాజశేఖర్ ఎన్నిక

మన ప్రగతి న్యూస్/కోరుట్ల

ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న పాత్రికేయుల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో అమలు చేస్తున్నట్లుగా జర్నలిస్టు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని టీఎస్జేయు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌనిఅన్నారు.
టి ఎస్ జే యు కోరుట్ల నియోజకవర్గ కమిటీ ఎన్నిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ అధ్యక్షతన మెట్పల్లి వి.ఎం.ఆర్ గార్డెన్స్ లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలోపురుషోత్తం నారగౌని మాట్లాడుతూ 10 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని, అక్రిడేషన్ల కమిటీలు పునరుద్ధరణ చేసి జర్నలిస్ట్ లందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలనికోరారు. అక్రిడేషన్లతో సంబంధం లేకుండా జర్నలిస్ట్ సంక్షేమ పథకాలను జర్నలిస్టుల అందరికీ అందేలా చూడాలని తెలిపారు . రాబోయే అక్రిడేషన్ కమిటీలలో అన్ని జర్నలిస్టు సంఘాలకు భాగస్వామ్యం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు గాజుల మహేష్, కడార్ల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన డిమాండ్లు:

  1. చిన్న పత్రికలను తక్షణమే ఎమ్పానెల్‌మెంట్‌లో చేయాలి
    2.సంక్షేమ పథకాలలో యూనియన్ల జోక్యం లేకుండా చూడాలి జర్నలిస్టుల సంక్షేమ పథకాలు నేరుగా అమలు చేయాలని, యూనియన్ల జోక్యం లేకుండా వ్యవస్థను మెరుగుపరచాలి.

3.మీడియా రంగానికి ప్రత్యేక పాలసీ రూపొందించి, జర్నలిస్టుల భద్రత, పత్రికా స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పించాలి.

  1. మీడియా ఉద్యోగుల సంక్షేమం జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన బీమా, పెన్షన్, మరియు ఇతర ఆర్థిక సహాయ కార్యక్రమాలను విస్తరించాలి. కోరుట్ల కార్యవర్గం: దీకొండ మురళి -గౌరవ అధ్యక్షులు.

జోరిగే శ్రీనివాస్ -అధ్యక్షులు.

తరి రాజశేఖర్ -ప్రధాన కార్యదర్శి.

1)పఠాన్ ఫిరోజ్ ఖాన్,
2)పింజారి శివ – ఉపాధ్యక్షులు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

నరేష్ – సహాయ కార్యదర్శి.

ఓంకారి శ్రీనివాస్ – కోశాధికారి.

బోడ దివాకర్ -ఆర్గనైజింగ్ సెక్రటరీ.

జాకీర్ హుస్సేన్ -ఆర్గనైజింగ్ సెక్రటరీ.

రవి రాజ్ – మీడియా ఇంచార్జ్.

ఈసీ మెంబెర్స్ :
పండిత్ రాజేందర్.

గట్ల శ్రీనివాస్.

గణేష్

సయ్యద్ ఫిరోజ్.
రమేష్
సునీల్
నాగేష్
అశోక్
మహేశ్వర్
రవీందర్
సంజీవ్
హరీష్ లు ఎన్నికయ్యారు.