- రఘునాథపల్లి మండల కేంద్రములో ప్రజల ఇబ్బందులు
- వెలుగులు పంచవు – వెతలు తీరవు
- గత వారం రోజుల నుండి వెలగని లైట్లు
- పట్టించుకోని పాలకులు,
అధికారులు - టోల్ వసూలు చేస్తున్నారు NH పైన లైట్లు వేయడం లేదని మండల ప్రజలు అగ్రహం
మన ప్రగతి న్యూస్/
రఘునాథపల్లి :
జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో NH -163 హైదరాబాద్ – హన్మకొండ జాతీయ రహదారిపై గత కొన్ని రోజుల నుండి లైట్లు వెలగడం లేదు. ప్రజలు, వాహన చోదకులు ప్రతీ రోజూ రాత్రపూట ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి కావడం వల్ల వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి.అధికారుల అలసత్వం, పాలకుల పట్టింపులేని తనం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోల్ వసూలు చేస్తున్నారు కానీ జాతీయ రహదారిపై లైట్లు వేయడం లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే జాతీయ రహదారిపై లైట్లు వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..