Breaking News

ముందస్తు అరెస్ట్ లు అప్రజాస్వామికం

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటి నందు శుక్రవారం రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆటో ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని స్థానిక ఆటో కార్మిక నాయకులు సిద్ధమవుతున్న సమయంలో స్థానిక విజయ పురి నార్త్ పోలీసు సిబ్బంది ముందస్తుగా వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది ,ఈ యొక్క అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ హీరే కార్ రమేష్ జి అన్నారు. తెల్లవారక ముందే ఆటో డ్రైవర్లను అరెస్టు చేయడం అప్రజస్వామిక చర్య అని ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి వారికి సంఘీభావం తెలుపుతూ వారికి మద్దతు తెలపడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశా వర్కర్లను ,టీచర్లను మహిళా సంఘాల వాళ్ళను రైతులను గొంతు నొక్కి ఈరోజు ఆటో కార్మిక సంఘాలను అరెస్టు చేయడం వారి హక్కులను నిర్వీర్యం చేసి వారిని అణగ తొక్కడం అప్రజాస్వామికమని ఉచిత బస్సు సౌకర్యం పెట్టి ఇప్పటికే ఆటో కార్మికులకు జీవనోపాధి లేకుండా కుటుంబ పోషణకు ఇబ్బంది కలిగే విధంగా చేసి వారి నడ్డి విరిచిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ హీరో కార్ రమేష్ జి లక్ష్మణ్ నాయక్ దేశ్యనాయక్ ,పి.సత్యనారాణ, రామస్వామి పి. శ్రీను ఆటో యూనియన్ నాయకులు టిఆర్ఎస్ ఆటో కార్మిక జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షులు నూకం శ్రీను, షేక్ మన్సూర్ ,జి వెంకటేశ్వర్లు బి అంజి, మంగతా నాయక్ టి శ్రీను ,వేముల నాగరాజు ,డి శరత్ జి సాగర్ ,జటావత్ ముని నాయక్ ,ఎన్ శ్రీను టిఎన్ టియు సి నాయకులు బద్రి, విజయ్ కిషోర్, సలీం తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి