Breaking News

వల్మిడి వాసికి అరుదైన గౌరవంజనగామ జిల్లా కోర్టు ఏజీపీగా చంద్రశేఖర్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:

మండలంలోని వల్మిడి గ్రామానికి చెందిన న్యాయవాది చెరుకు చంద్రశేఖర్ గౌడ్ కు అరుదైన గౌరవం దక్కింది.
జనగామ జిల్లా కోర్టు (ఏ జీ పీ) అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయ వ్యవహారాల కార్యదర్శి ఆర్. తిరుపతి పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చంద్రశేఖర్ బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకొని 2013 నుంచి జనగామ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ
తనకు అప్పగించిన విధులను ఎలాంటి పక్షపాతం, తారతమ్యం లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు.
తన పై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి, న్యాయా
ధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏజీపీ పదవి రావడానికి సహకరించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి లకు ,ధన్యవాదాలు తెలిపారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి