Breaking News

సామాజిక కవి భుజేందర్ కు ఘన సన్మానం..

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

అంతర్జాతీయ శ్రీ శ్రీ కళావేదిక సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాహితీ వసంతోత్సవం 159 వ జాతీయ శతాధికా కవి సమ్మేళనం శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పోతుగంటి వీరాచారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించగా.. శ్రీశ్రీ కళావేదిక ఆహ్వానం మేరకు జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన సామాజిక కవి, శ్రీ పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యపు భుజేందర్ జాతీయస్థాయి కవి సమ్మేళనంలో పాల్గొని, నవ సమాజ నిర్మాణానికై నే వెలుగు రేఖనై పల్లవిస్తాను! అనే శీర్షికతో కవిత గానం చేయగా.. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక నిర్వాహకులు భుజేందర్ ను శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక, ప్రశంసా పత్రమును అందించి సత్కరించారు.భుజేందర్ ను పలువురు సాహితీ పెద్దలు, జనగామ జిల్లా కవులు కళాకారులు, బమ్మెర గ్రామ ప్రజలు భుజేందర్ అభిమానులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జా తీయ శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ సీఈవో కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి టీ. పార్థసారథి, శ్రీహరికోటి, సూర్యాపేట జిల్లా శ్రీ శ్రీ కళావేదిక ప్రధాన కార్యదర్శి మాడుగుల జార్జ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పూసోజు పద్మ , మహిళా ప్రధాన కార్యదర్శి నల్లగొండ జ్వాల, కార్యదర్శి శివ రాత్రి వెంకన్న, విశ్రాంత ఎమ్మార్వో అరుణ్ జ్యోత, జిల్లా కన్వీనర్ అమీర్ ఖాన్, వనం మంజు భార్గవి జిల్లా కార్యవర్గ సభ్యులు రెండు తెలుగు రాష్ట్రాల కవులు కళాకారులు పాల్గొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..